ఐడీఏ బొల్లారంలో భారీ అగ్రిప్రమాదం

మెదక్:జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు  ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై భద్రత సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.