ఐదవ విడత పల్లె ప్రకృతి కార్యక్రమం విజయవంతం-జడ్పీటీసీ అనిల్ జాధవ్.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పర్చడాని మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో బాగుందనిమండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ సజన్ అన్నారు.ఐదవ విడత పల్లె ప్రకృతి కార్యక్రమం ముగింపులో భాగంగా శనివారం నెరడిగొండ  మండల కేంద్రంలోని జడ్పీ స్కూల్ యందు పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఇట్టి పోటీలో ప్రతిభ కనబరుస్తూ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించుటలో బాగంగా ముఖ్య అతిథిగా మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్,ఎంపీపీ రాథోడ్ సజన్ స్థానిక సర్పంచ్లు హాజరై గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సన్మానించి జ్ఞాపికాలుగా మొక్కలను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి ముగింపులో భాగంగా మండల వ్యాప్తంగా గ్రామసభ నిర్వహించారని గ్రామస్థుల సహకారంతో 5వ విడత పల్లె ప్రకృతి  కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుల బృందానికి విద్యార్థులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంట వెంకట రమణ ఉప సర్పంచ్ నాయకులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నార