ఐపిఎస్‌ ఉమేశ్‌కుమార్‌ అభ్యర్థనను పరిశీలించాలి:సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: డిజీపీ పదవికోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది. డీజీపీ పదవికి దినేష్‌రెడ్డి నియమకం చెల్లదని ఆయన కన్నా సీనియర్‌ అధికారులు ఉన్నందున దినేష్‌రెడ్డి స్థానంలో సీనియర్‌ ఐపిఎస్‌ అధికారిని నియమించే విషయాన్ని పరిశీలించాలని గతంలో కంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ తీర్పు ఇదివరకే ఇచ్చింది. అయానా ఎలాంటి చర్చలు ప్రభుత్వం తీసుకోలేదని, తనకు డీజీపీ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉమేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది.