ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్ చార్జర్స్
ముంబాయి: బాంబే హైకోర్టుముందు గడువు లోపల రూ.100కోట్ల బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేకపోయినందుకు డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్రాంచైసీ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటిడ్ న్యాయస్థానాన్ని అక్టోబర్ 15వరకు గడువు కోరింది. హైకోర్టు అందుకు తిరస్కరించింది. ఇదిలా ఉండగా డెక్కన్ ఛార్జర్స్ ప్రాంచైసీని ఉంబాయికి చెందిన కమలా ల్యాండ్ మార్క్ అనే సంస్థకు విక్రయించినట్లు కూడా వార్తాలు వచ్చాయి.