ఐపీఎల్ పాసులు పట్టేదెలా?
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నతాదికారులకు పెద్ద కష్టమే వచ్చింది. అదే ఐపీఎల్ కష్టం . అసలే వేసవి కాలం.ఆపై సెలవులు, ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఇంట్లో ,ఆపీసులో వారిని పాసులు అడిగే వారి సంఖ్య ఎక్కువ. ఇందుకోసం ఏం చెయ్యాలి. ఎలా పాసులను సాధించాలి. అన్న సందేహాల నడుమ ఓ ఆలోచన వచ్చింది వారికి . వెంటనే వారి ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ కు సంకేతాలు అందాయి. వెంటనే శావ్ రంగంలోకి దిగింది. మాట వినని సందర్భాల్లో క్రికెట్ సంఘాలపై అప్పుడప్పుడు సందించే అస్త్రాన్ని మరోసారి బయటికితీసి హెచ్‌సీఎ పై ఎక్కుపెట్టింది.