ఐపీఎల్‌ -6లో కోల్‌కతా శుభారంభం

ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన డిపెండింగ్‌ చాంఫియన్‌
ఐపీఎల్‌ ఆరంభమైంది. కానీ అభిమానులు ఆశించినట్టు కాదు. బ్యాటింగ్‌ మెరుపుల్లేవు ..పరుగుల వరద పారలేదు. ..హోరాహోరీ పోరాటం లేదు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు డిల్లీ తలాడించక తప్పలేదు. విండీస్‌ స్పిన్‌ ఆటగాడు నరైన్‌ దెబ్బకు డిల్లీ కుదేలైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.