ఐసిడిఎస్ పోషణ మాసం కార్యక్రమం

గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): ఐసీడీఎస్ పోషణ మాసంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాలు గర్భిణీలు  బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ స్వరూప బిక్షం అన్నారు. గురువారం గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం సెక్టార్ పరిధిలో రాయిని గూడెం 2 అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించిన పౌష్టికాహార  మాసోత్సవాలలో  భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాలపై  గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లులకు అవగాహన  కల్పించారు.అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోని ఆరోగ్య వంతులుగా ఉండాలన్నారు.మాతా శిశు సంరక్షణ సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  ఐసిడిఎస్ సూపర్వైజర్  రాజ్యలక్ష్మి , ఎంపీటీసీ సందీప్ , వైస్ సర్పంచ్ గుండు వీరబాబు , ఐసీపీస్ సాయి త్రిలోక్ , అంగన్వాడీ టీచర్లు ఆయాలు  పాల్గొన్నారు.
Attachments area