ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నిక
శశాంక్ గత మంగళవారం బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు. ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌గా పోటీ చేయడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ బరిలో నిలవాలంటే సొంత క్రికెట్ బోర్డుతో అతడికి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. గతంలోమాదిరిగా కాకుండా ఐసీసీ అధ్యక్ష ఎన్నికలో ఇటీవల కొన్ని సవరణలు చేశారు. వాటి ప్రకారం.. వంతుల వారీగా ఏదో ఒక బోర్డు నామినేట్ చేయడానికి వీల్లేదు. ఐసీసీ డైరెక్టర్లలో ఒకరు పోటీపడే వ్యక్తి పేరును ప్రతిపాదించాలి. కనీసం రెండు సభ్యదేశాల మద్దతు ఉండాలి. అయితే శశాంక్‌కు ఐసీసీ డైరెక్టర్ల మద్దతుండటంతో పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2008 నుంచి 2011వరకు శశాంక్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. గతేడాది జగ్మోహన్ దాల్మియా మృతితో రెండోసారి ఈ పదవిలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే ఐసీసీ ఎన్నికల నేపథ్యంలో శశాంక్ రాజీనామా చేశారు.