ఐసెట్‌లో ‘అరబిందో’ విద్యార్థుల ప్రతిభ
గోదావరిఖని టౌన్, జూన్ 11, (జనంసాక్షి):
ఐసెట్-2012 ఫలితాల్లో గోదావరిఖని అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన ర్యాంకులను సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాలకు చెందిన కోట సందీప్(143), నూతి శ్రీధర్(470)ర్యాంకులను సాధించి గోదావరిఖని పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్బంగా అనేక స్థాయిల్లో ర్యాంకులను సాధించిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కె.సురేష్‌కుమార్, ప్రిన్సిపాల్ వి.చైతన్యసాగర్, డైరెక్టర్ ఎండి.తయ్యూబ్అస్లాం, పోషకులు అభినందించారు.
కెేయు ఫలితాల్లో అరబిందో విద్యార్థుల విజయభేరి…
కాకతీయ యూనివర్శిటీ డిగ్రీ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించి, విజయభేరి మ్రోగించారు. బికాం విభాగంలో 1500మార్కులకు గాను మయూర్అగర్వాల్ 1254మార్కులు, పర్స సమత 1253, పులి అక్షిత 1248, మేరాజ్ ఫాతిమా 1213, ఫర్హానా 1204 మార్కులను సాధించగా… బిఎస్సీ(మ్యాథ్స్) విభాగంలో 1800మార్కులకు గాను శ్యామల ప్రవళిక 1450, సమ్రీన్ 1417, బిఎస్సీ(బయోటెక్నాలజీ)లో సిలోత్ మౌనిక 1379, అమతుల్ ముకీన్ 1362మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సాధించిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కె.సురేష్‌కుమార్, ప్రిన్సిపాల్ వి.చైతన్యసాగర్, డైరెక్టర్ ఎండి.తయ్యూబ్అస్లాం, పోషకులు అభినందించారు.