ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బాలిక మృతి

శివంపేట: ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంపూర్ణ (15) అనే బాలిక హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మండలంలోని దొంతి గ్రామానికి చెందిన ఈ బాలికకు తూప్రాన్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత శ్రీనివాస్‌ పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేకే సంపూర్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.