ఒంటిమిట్ట ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

కడప,మార్చి26  (జ‌నంసాక్షి) : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ స్వామికి డిప్యూటి సిఎం కెఇ కృష్ణమూర్తి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.  ఈ నెల 27వ నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణ ప్రకటించారు. విభజన తరవాత ఇక్కడ అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 6 నుంచి 10 గంటల వరకు వాహన సేవ, అదే సమయాల్లో కూచిపూడి, రామదాసు కీర్తనలు, జాంభవతి పరిణయం, బాలనాగమ్మ, కోలాటం, రామదండు, చెక్కభజన, కత్తిసాము, కేరళ కళాకారులచే వాయిద్యం లాంటి కార్యక్రమాలుంటాయని వివరించారు.  ఉత్సవాల్లో తాగునీరు, అపరిశుభ్రత నివారణ చర్యలను దేవస్థానం అధికారులు చూస్తున్నారని చెప్పారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్‌ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. 28న ధ్వజారోహణం శ్రీరామజయంతి సాయంత్రం పోతన జయంతి శేషవాహనం ,29న వేణుగానాలంకారం హంసవాహనం,30న వటపత్రసాయి అలంకారం సింహవాహనం,31న నవనీత కృష్ణాలంకారం హనుమత్‌సేవ ,ఏప్రిల్‌1న మోహినీసేవ గరుడసేవ

2న శివధనుర్భాగలంకారం, ఎదురుకోలు కల్యాణ్ఠత్సవం. గజవాహనం ,3న రథోత్సవం –

4న కాళియమర్థనాలంకారం అశ్వవాహనం ,5న చక్రతీర్థం ,6న సాయంత్రం ధ్వజారోహణం, ఏకాంతసేవ, పుష్పయాగం ఉంటాయి. బ¬్మత్సవాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఉత్సవాలు పూర్తయ్యేవరకూ 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని  తెలిపారు.  ఉత్సవాల కోసం ఒంటిమిట్టకు ప్రత్యేక విద్యుత్తు లైనును కేటాయించారు. . విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు చోటుచేసుకోకుండా, లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.