ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు

హైదరాబాద్‌ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెదేపాను భూస్థాపితం చేస్తానన్న గాలి జనార్ధన్‌రెడ్డి అడ్రస్‌ లేకుండా పోయారని… నిప్పులా నిజాయితీగా ఉన్నందుకే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేపోయారని అన్నారు. పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? అని ప్రశ్నించారు. నాయకులు పార్టీ వీడినా.. కార్యకర్తలు అండగా ఉన్నారని, కార్యకర్తల రుణం తీర్చుకుంటామని వెల్లడించారు.