ఒకే విడతలో రుణమాఫీ

3
– మంత్రి పోచారం

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. విత్తనోత్పత్తిలో రైతుల సలహాలు తీసుకుంటామన్నారు. దేశ విత్తనోత్పత్తిలో 60 శాతం రాష్ట్రంలో జరుగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి జరిగే సీడ్‌ కాంగ్రెస్‌లో విత్తనోత్పత్తిపై రైతులతో చర్చిస్తామని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి పోచారం హైదరాబాద్‌ లో విూడియాతో మట్లాడారు. రైతుకు లాభసాటిగా ఉండేలా సీడ్‌ పాలసీ తయారు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో విత్తనోత్పత్తి ప్రధానమైందని అన్నారు. 2001లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 196 మిలియన్‌ టన్నులుండగా, 2014లో 254 మిలియన్‌ టన్నులకు పెరిగిందని తెలిపారు. ఈ సారి జాతీయ విత్తన సదస్సు నిర్వహించే అవకాశం మన రాష్ట్రానికి దక్కిందని పేర్కొన్నారు. విత్తన సదస్సు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణను ప్రపంచానికే విత్తన భాండాగారగా తయారు చేస్తామన్నారు. త్వరలోనే కరువు మండలలాను వెల్లడిస్తాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రైతులకు అత్యంత లాభసాటిగా ఉండేలా సీడ్‌ పాలసీ తయారు చేస్తున్నామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  సీడ్‌ కాంగ్రెస్‌లో విత్తనోత్పత్తిపై రైతులతో చర్చిస్తామని చెప్పారు. వ్యవసాయంలో విత్తనోత్పత్తి ప్రధానమైన అంశమన్నారు. తెలంగాణను ప్రపంచానికే విత్తన భాండాగారగా తయారు చేస్తామన్నారు.  తెలంగాణలో రైతుల రుణ బకాయిలు ఒకే దఫాలో చెల్లించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కరవు మండలాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి 8వ జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సదస్సులో విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారన్నారు.