ఒక హృదయం ఓల్డ్ ఏజ్ హోమ్ ను సత్కరించిన: సబ్ కలెక్టర్.
బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఒక హృదయం ఓల్డ్ ఏజ్ హోమ్ వయోవృద్ధుల ఇంటర్నేషనల్ వారోత్సవాలు సందర్భంగా సబ్ కలెక్టర్, సిడబ్ల్యూసీ జిల్లా అధికారులు ఒక హృదయాన్ని సత్కరించారు. వారోత్సవాల సందర్భంగా సారపాక లో ఒక హృదయం ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహిస్తున్న మిట్ట కంటి సంజీవ రెడ్డి కి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, జిల్లా శిశు సంక్షేమ అధికారిని వరలక్ష్మి చేతుల మీదుగా సత్కరించి అవార్డు అందజేశారు. ఒక హృదయం చేస్తున్న సేవలను గుర్తించి మరెన్నో సేవలు ఒక హృదయం తరఫున చేయాలని సబ్ కలెక్టర్ జేసీ వెంకటేశ్వరావు సభలో సూచించారు. ఒక హృదయానికి పూర్తి సహకారాలు అందిస్తామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వరలక్ష్మి, సిడిపిఓ ప్రమీల, ఎఫ్ ఆర్ ఎఫ్ నరేష్, డి డబ్ల్యూ ఓ వరప్రసాద్, మహిళా అధికారిని హరి కుమారి పాల్గొన్నారు.