ఒడిశాలో నలుగురిని అపహరించిన మావోయిస్టులు
భువనేశ్వర్: ఒడిశాలో మివోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రెండు జిల్లాల నుంచి నలుగురు వ్యక్తులను అపహరించుకుపోయారు. ఒనకడిల్లిలో మహిళ సహ ఇద్దరిని, మల్కాన్‌గిరి జిల్లాలో మరో ఇద్దరిని ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన వారిలో ఓ ప్రాజెక్ట్ ఉద్యోగి బి.వి రాంప్రసాద్, ఇనకడిల్లికి చెందిన మద్యం వ్యాపారి జానకీరౌతు సనోడెరాయిల్‌కు చెందిన డొయా చలాన్, బొడోడురాయిల్‌కు చెందిన తలయారి లక్ష్మిణపంగి ఉన్నారు.