ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన వంశధార ట్రైబ్యునల్‌

ఢిల్లీ: ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను వంశధార ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. వంశధార ట్రైబ్యునల్‌ లో సభ్యుడిగా జస్టిస్‌ గులాం అహ్మద్‌ నియామకాన్ని ఒడిశా సవాలుచేసింది. సభ్యుల నియామకం, తొలగింపు అధికారం తమకు లేదని ట్రైబ్యునల్‌ చైర్మన్‌ ఒడిశా ప్రభుత్వానికి స్పష్టంచేశారు. 8 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను ట్రైబ్యునల్‌  ఆదేశించింది. నదీ జలాల పంపకంపై డిసెంబరు 4 నుంచి మరోసారి వంశధార ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టనుంది.

తాజావార్తలు