ఒప్పందం ప్రకారం రెండు రోజుల్లో చైర్ పర్సన్  స్వప్న రాజినామచేయాలి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఫోన్ చేసినా స్పందించడం లేదూ….
ఇచ్చిన మాట తప్పడం మహేందర్ రెడ్డి కె సాధ్యం.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు జులై 30(జనంసాక్షి)ఒప్పందం ప్రకారం రెండు రోజుల్లో చైర్ పర్సన్  స్వప్న రాజినామచేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపేర్కొన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం మేరకు మేమంతా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.మున్సిపల్ చైర్ పర్సన్ బరిలో ఆ రోజు ఇద్దరు ఉంటే రెండున్నర సంవత్సరాలు ప్రపోజల్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తెరమీదకు తీసుకోవచ్చారని గుర్తుచేశారు, పార్టీ అధిష్టానం జిల్లా ఎలక్షన్ ఇన్చార్జి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ నవీన్ రావు ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారనిసంబంధించిన పత్రాలు ఉన్నాయని వివరించారు.నేడు ఈ ఒప్పందాన్ని విస్మరించి మేము చైర్పర్సన్ పదవి దిగేది లేదని అనడంలో అర్థం నాకు తెలియడం లేదని ఎమ్మెల్యే  అన్నారు.ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోను స్పందించడం లేదని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న చైర్పర్సన్ పదవి నుండి దిగిపోవాలని లేనిచో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్ నరుకుల సింధుజ గౌడ్, మాంకాళ్ రాఘవేందర్,ఆసిఫ్, మరియు సీనియర్ నాయకులుసంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.