ఒప్పంద వైద్యుల నియామకం

శ్రీకాకుళం, జూలై 26 : జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టారు. 22 మందిని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పి.హెచ్‌.సి.లకు నియమించేందుకు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదపను జెసి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. ఎం.శారధ, అదనపు డిఎంహెచ్‌వో డా. ఎం.ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.