ఒమిక్రాన్ తరుముతున్న వేళ ఎన్నికలు అవసరమా ?
వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు రాజకీయ పార్టీలు దృష్టి సారిం చాయి. కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఒమిక్రాన్ తీవ్రతను అధికార పార్టీ గానీ, విపక్ష పార్టీలు గాన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల జరిగితే తామే అధికార పీఠం దక్కించుకోగలమన్న ధీమాతో అన్ని పార్టీలు ఎన్నికలను కోరుకుంటున్నాయి. అందుకే ఎక్కడా బహిరంగంగా ఈ ఎన్నికలు వాయిదా పడితే మంచిదన్న అభిప్రాయం రావడం లేదు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశప్రజలు మరోమారు ఆందోళనతో ఉన్నారు. చాపకిందినీరులా ఒమిక్రాన్ మెల్లగా విస్తరిస్తోంది. యూరప్,ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న వ్యక్తులతో ఇక్కడా మెల్లగా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకా సమావేశాల్లో కరోనా వ్యాప్తిపై కనీసంగా కూడా చర్చించలేదు. సెకండ్‌వేవ్ వల్ల కలిగిన మరణాలు, ప్రజల ఇబ్బందులు, చనిపో యిన కుటుంబాలను ఆదుకోవడం వంటి విషయాలపై చర్చిస్తారని ప్రజలు ఆశించినా అధికారపార్టీ కానీ, విపక్ష నేతలు కానీ అందుకు పూనుకోలేదు. ఎవరి ఎజెండా వారిదే అన్నట్లుగా పార్లమెంట్‌ను స్తంభింప చేసి ముంగించేశారు. ఇదంతా ప్రజలను అవమానించడం వారిని తృణీక రించడం తప్ప మరోటి కాదు.ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పడం లేదు. రాజకీయ పార్టీల నేతలంతా ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల పైనే దృష్టి సారించారు. అధికార బిజెపి, విపక్షాలు కూడా ప్రజల ప్రాణాలు ఏమైతే మాకేంటన్న ధోరణిలో ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ప్రధాని మోడీ అయితే అన్నీ వదిలి ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై మక్కువతో తిరుగుతున్నారు. అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యాక్రమాలతో బిజీగా ఉన్నారు. నిజానికి ఈ సంక్షోభ సమయంలో ఎన్నికలు అవసరామా అని ఎవరు కూడా చర్చించడం లేదు. కరోనా విస్తరిస్తోన్న దశలోనే 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల కంటే భారీగా పోలింగ్ నమోదైంది. ఇక ఈ ఏడాది కూడా కరోనా రెండోదశ ఉద్ధృతి సాగుతున్న దశలోనే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఉంది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు జరిగితే వైరస్ వ్యాప్తి తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీల పదవీకాలం త్వరలో ముగియనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆయా రాష్టాల్ల్రో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు వచ్చే ఏడాది నిర్వహించాల్సిన అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఈ నెల 27న కేంద్ర ఆరోగ్యశాఖ అధికారు లతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒమైక్రాన్ వ్యాప్తి, కరోనా థర్డ్‌వేవ్ పరిస్థితు లపై ఆరోగ్యశాఖ అభిప్రాయా లను తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం కీలకంగా మారనుంది. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చేవారం తాను పర్యటించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడిరచారు. రాష్ట్రంలో ఒమైక్రాన్ వ్యాప్తి, క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులను సవిూక్షించ నున్నట్టు చెప్పారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సీఈసీ పేర్కొ న్నారు. ఇదే సందర్భంలో అలహాబాద్ హైకోర్టు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసింద. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో యూపీతో సహా అన్ని రాష్టాల్ల్రో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని పరిస్థితి చూస్తుంటే కరోనా రెండో ఉధృతి మించి ఉండొచ్చని అలహాబాద్ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. ’కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ర్యాలీలు నిర్వహిం చడం ఏవిధంగానూ సాధ్యపడదు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా చైనా, నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాలు పాక్షిక లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా రాజకీయ పార్టీల ర్యాలీలను ఆపండన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు సమర్థనీయమే. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయమనడంపై అభిప్రా యాలు ఎలా ఉన్నా చర్చకు ఆస్కారం కలిగించింది. ప్రస్తుత పరిస్థితులపై హైకోర్టు సుతిమెత్తని హెచ్చరి కలు చేసింది. ఇకపోతే ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఇంతవరకు షెడ్యూల్ ప్రకటించలేదు. దీనిపై ఇసి చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎన్నికల వాయిదాకు సంబంధించి మన రాజ్యాంగం ఏం చెబుతోందంటే.. అవసరాన్ని బట్టి అత్యవసర నిర్ణయం తీసుకునే వెసులబాటు కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఆరు నెలల వరకు ఎన్నికలను వాయిదా వేయవచ్చు. అయితే ఇది హౌస్ అండ్ అసెంబ్లీ రెండు సెషన్‌ల మధ్య రాజ్యాంగ పరంగా నిర్వచించబడిన పరిమితి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(1), ఆర్టికల్ 174(1) ప్రకారం ఇలా జరుగుతుంది. ఆరునెలల తర్వాత మరికొంత కాలం పొడిగించాలంటే మాత్రం ఎగ్జిక్యూటివ్ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అత్యవసర పరిస్థితి తలెత్తితే ఆర్టికల్ 172(1)లోని నిబంధన ప్రకారం, ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆరు నెలల పాటు అదనంగా ఒక ఏడాది పాటు ఎన్నికలను వాయిదా వేయవచ్చు. అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డ సమయంలోనూ ఎన్నికలను వాయిదా వేసుకోవచ్చిన రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రపతి సుప్రీం కనుక ఆయన ఆదేశాల మేరకు వాయిదాకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఎన్నికలన్నా ముందు ప్రజల ప్రాణృాలు ముఖ్యం. అందువల్ల ఎన్నికలను వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టం లేదు. అప్పటి వరకు ఆయా రాష్టాల్ల్రో రాష్ట్రపతి పాలన విధించి ముందుకు సాగవచ్చు.