ఒలంపిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు

– బ్యాడ్మింటన్‌లో ముగిసిన కశ్యప్‌ పోరు

-క్వార్టర్‌లో సానియా పేస్‌ జోడి
లండన్‌: ఒలంపిక్స్‌లో భారత్‌కు గురువారం హిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్‌ పోరు ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శణతో క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించిన కశ్యప్‌ చైనా ఆటగాడు చాంగ్‌ వీలీ చేతిలో 19-21, 11-21తో ఓటమి పాలయ్యాడు. దీంతో టోర్నీలో కశ్యప్‌ పోరు ముగిసింది.