ఒవైసీపై మండిపడ్డ ముఖ్యమంత్రి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఓవైసీ పై ముఖ్యమంత్రి మండి పడ్డారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అవసరమైనప్పుడల్లా ముస్లింల సంక్షేమంపై సమీక్షలు నిర్వహించామని వెల్లడించారు. కాంగ్రెస్ వల్లే ఎంఐఎం 7 సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ లౌకికవాదంపై ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు.