ఒవైసీ సోదరుల కేసు విచారణ వాయిదా
సంగారెడ్డి : మెదక్ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ల కేసు విచారణను మే 13కు సంగారెడ్డి కోర్టు వాయిదా వేసింది. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున గడువు కావాలని అసదుద్దీన్ తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను వాయిదా వేస్తూ జిల్లా కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.