ఓటమిని ఇంగ్లండ్ అంగీకరించాలి
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్ మీడియా కథనాలు వండివార్చడంపై మాజీ క్రికెటర్, నజబ్‌గఢ్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని ఇంగ్లండ్ గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే.. ఆ జట్టు గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించాడు. ‘ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ‘హిందూస్తాన్ టైమ్స్’ తో మాట్లాడుతూ అన్నారు.రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి బాల్‌ను ట్యాంపర్ చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది.