ఓటమి అంచున ఆస్ట్రేలియా
మొహాలీ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. 170 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలబడింది. లంచ్ విరామానికి భారత్‌పై ఆస్ట్రేలియా 79 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా సగం రోజు ఆట మిగిలి ఉండటంతో భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసిన స్టార్క్, హడిన్ క్రీజులో ఉన్నారు. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది.