ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం

స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌

జోరుగా ఏర్పాట్లలో అధికారులు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరిగే అవకాశాలుండడంతో అధికారులు జిల్లాలో అధికారులు అసెంబ్లీ ఎన్నికలకుఅన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అధికారులు అందజేసిన జాబితా ప్రకారం బూత్‌ లెవల్‌ అధికారులు పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓటర్లు వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాలో ఉన్న వారి పేర్లను అడిగి తెలుసుకుంటున్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకొనే వారికి ఫారం-6ను పంపిణీ చేస్తున్నారు. చనిపోయిన వారితో పాటు అనర్హులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ పక్రియను స్వయంగా కలెక్టర్‌ దివ్య, జేసీ సంధ్యారాణి పరిశీలించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల పక్రియను

వేగవంతం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ నెల 25 వరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉండగా.. జిల్లా వ్యాప్తంగా 518 పోలింగ్‌ స్టేషన్లలో నిర్దేశిత వ్యవధిలో ఈ పక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను బీఎల్‌వో పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో బూత్‌లెవల్‌ అధికారులు జాబితా ప్రకారం పోలింగ్‌ స్టేషన్ల వారీగా వివరాలను పరిశీలిస్తున్నారు. ఒకే ఇంటిపేరు, పేరు, వయస్సు, చిరునామా కలిగిన వారిని గుర్తించిన అధికారులు ఆ పేర్లను పరిశీలించి రెండు చోట్ల నమోదై ఉంటే వారు వివరాలు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు 2015లో ఓటరు జాబితా సవరణతో పాటు ఇటీవల ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఐఆర్‌ఈఆర్‌లో భాగంగా 29 వేల ఓట్లు తగ్గాయి. ఈ సారి ఓటరు జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా సరిచేయాలని అధికారులు ఆదేశించా రు. నియోజకవర్గాల వారీగా వివిధ రాజకీయ పార్టీల నా యకులకు ఓటర్‌ లిస్ట్‌ను అందజేశారు. వారు సైతం బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకుని కొత్త ఓటర్లను చేర్పిస్తున్నారు. కలెక్టర్‌ దివ్య ఓటరు జాబి తా సవరణ పక్రియను పరిశీలించారు. అధికారులు సి బ్బందికి తగు సూచనలు చేయడంతో పాటు స్థానికులతో మాట్లాడారు.