ఓటర్ జాబితలో మార్పులు చేర్పులు ఉంటే చెక్ చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.  గద్వాల నడిగడ్డ, ఆగస్టు 22 (జనం సాక్షి);  ఎన్నికలు రానున్న సందర్బంలో 2023 సవత్సరానికి సంబంధించి ఓటరు జాబితా ను పబ్లిష్ చేయడం జరిగిందని, తహసిల్దార్లు, బూత్ లెవల్ అధికారులు అట్టి జాబితా లో మార్పులు, చేర్పులు, ఉంటే చెక్ చేసుకోవాలని జిల్లా కల్లెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.మంగళవారం ఐడిఓసి సమావేశం హాలు నందు బూత్ లెవల్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడి ఓ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయస్సు గల వారు అందరు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా వారి పేర్లు నమోదు అయి ఉన్నవా చెక్ చేసుకోవాలని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు.ఓటు హక్కు నమోదు ఫారం 6, 7, 8 , ఫామ్స్ పెండింగ్ ఉన్న వాటిని ఏరోజు కారోజు పూర్తి చేయాలన్నారు. ఫారం-6 ద్వారా నమోదు చేసిన ఓటర్ల జాబితా ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. బిఎల్వోలు వారి వారి మండలాలలో తాసిల్దారుల సహకారంతో ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు, డబల్ ఓటర్లను పరిశీలించి, కొత్త ఓటర్లు మిస్ కాకుండా పూర్తి చేయాలన్నారు. చనిపోయిన వారు, షిఫ్ట్ అయిన వారిని చెక్ చేయాలన్నారు. ప్రతి బి ఎల్ ఓ పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, లేదా చూసుకోవాలని తెలిపారు. తహసిల్దార్లు, ఆపరేటర్లు డబల్ ఉన్న ఓటర్లను చెక్ చేసి ఫార్మ్ 6 ద్వారా నమోదు చేయాలనీ,డూప్లికేట్ ఉన్న వాటిని లిస్టు తయారు చేయాలనీ ,పోలింగ్ స్టేషన్ కు 2 కి.మి. దూరంలో, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో త్రాగునీరు,మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు తప్పని సరిగా ఉండాలని, ర్యాంపులు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్, అపూర్వ చౌహాన్ , తహసిల్దార్లు,బి ఎల్ ఓ లు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.