ఓటర్ లో చైతన్యాన్ని పెంపొందించేందుకే బైక్ ర్యాలీ……

తుంగతుర్తి మే 11(జనం సాక్షి)
స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోండి
జిల్లా అదనపు కలెక్టర్ జి ఎస్ లత

ఓటర్ కు ఓటు యొక్క అవగాహన ప్రాముఖ్యత తో పాటు వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు కలెక్టర్ జిఎస్ లతా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల నుండి సిరి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బైక్ ర్యాలీ యొక్క లక్ష్యం పౌరులతో నేరుగా పాల్గొనడం ఓటింగ్ యొక్క ప్రాముఖ్యతను గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటర్లందరూ స్వేచ్ఛ వాతావరణం లో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మీ ఓటు మీ ఇష్టం మీ కర్తవ్యం అని ఆమె అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎండ వేడి లేకుండా టెంట్లు తాగునీరు కల్పించామని తెలిపారు ఈసారి ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమణారెడ్డి ఎస్సై ఏడుకొండలు తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు యువకులు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు