ఓటు వేసే విదానంపై అవగాహన పెంపొందించాలి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జనవరి 31 (): భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల్లోఓటర్లకు ఓటు విదానంపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ముద్రించి పంపిన పోస్టర్లను జిల్లాలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ప్రదర్శించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఓటర్లకు పోలింగ్‌ కేంద్రంలో బ్యాలేట్‌ పత్రంతో పాటు ఇచ్చే ఊదారంగు స్కెచ్‌పెన్‌తో మాత్రమే ఓటు వేయాలని సూచించారు. ఓటర్ల వద్ద ఉండు ఇంక్‌పెన్‌, పెన్సిల్‌, బాల్‌ పాయింట్‌ పెన్‌లను ఉపయోగించకూడదని తెలిపారు. ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటు ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో 1 అంకె వేయాలని సూచించారు. తదుపరి ప్రాధాన్యత ఓటు అభ్యర్థుల ఎంపిక ప్రకారం వారి పేర్లకు ఎదురుగా 2,3,4,5 అంకెలలో రాయాలని అన్నారు. ఓటరు బ్యాలెట్‌ పత్రము చెల్లుబాటు కావడానికి మొదటి ఎంపిక సంఖ్య 1 మొదటి ప్రాధాన్యత అభ్యర్థికి ఎదరుగా రాయడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రెండు గడుల మద్య ఉన్న గీతపై ఓటరు తన ప్రాధాన్యత అంకెను వ్రాసినచో అట్టి బ్యాలెట్‌ పత్రము చెల్లదని కలెక్టర్‌ తెలిపారు.