ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌లో సైతం ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు.