ఓదేలు వ్యవహారంతో అశావహులకు చుక్కెదురు

అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేసిన కెసిఆర్‌

ఇక ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న అభ్యర్థులు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు నల్లాల ఓదేలుకు సిఎం కెసిఆర్‌ హితబోధ చేయడంతో ఆయన శాంతించారు. ఆయన ఇక బాల్కసుమన్‌కు ప్రాచరం చేస్తానని ప్రకటించారు. ఇదిలావుంటే ఈ ఘటనతో టిక్కెట్ల మార్పు ఉండదని కెసిఆర్‌ స్పష్టం చేశారు. దీంతో టికెట్లు ఖరారైన నేపథ్యంలో బోథ్‌, ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రాథోడ్‌ బాపురావ్‌, రేఖా నాయక్‌లు ఉత్సాహంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్లలెల్లో వారి వర్గీయు లు అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామంటూ ప్రచారాన్ని చేపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఖరారు సందిగ్ధంలో ఉండడంతో ఆపార్టీ నేతలెవ్వరూ ప్లలెల్లో ప్రచారానికి ఒడిగట్టలేకపోతున్నారు. బీజేపీ నాయకులు మాత్రం టికెట్టు ఎవరికి లభించినా తాము సిద్ధమే అంటూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఏది ఏమైనా టీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల జాబితా తప్పకుండా మారవచ్చని నాయకులు కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. అభ్యర్థులను మారిస్తే తాము ప్రచారానికే దూరం గా ఉంటామని అభ్యర్థుల వర్గీయులు బాహాటంగానే నొక్కి చెబుతున్నారు. అభ్యర్థులకు సైతం మార్పు భయం పట్టుకుంది. ఒకవైపు వారి వర్గీయులతో ప్రచారం చేస్తూనే తమ టికెట్లను కాపాడుకునేందుకు తమదైన రీతిలో అధిష్ఠానంతో ప్రతి రోజు టచ్‌లో ఉంటున్నారు. జాబితా మార్చవచ్చన్న సాంకేతికాలు సైతం వెలువడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు, అసమ్మతి సెగల వల్ల జాబితా తప్పకుండా మారవచ్చని భావించారు. నల్లాల ఓదేలు విషయంలో సిఎం ఖరాఖండిగా ఉండడంతో ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా మారవచ్చనే అనుమానాలు ఊపందుకున్నా అలాంటి ఛాన్స్‌ లేదని స్పష్టం అయ్యింది. బోథ్‌ అసెంబ్లీ ని యోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తిరిగి రాథోడ్‌ బాపురావుకు ప్రకటించడంతో ఎంపీ గోడం నగేష్‌కు టికెట్టు కేటాయించాలని అధిష్ఠానంపై మరింత ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే టీఆర్‌ఎస్‌ ఆదివాసీ, గిరిజన నాయకులు బహిరంగంగా నగేష్‌ కు టికెట్టు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. బోథ్‌, ఖానాపూప్‌ అసెంబ్లీ టికెట్లు ఆదివాసీ గిరిజన నాయకులకు ఇవ్వాలని ఆదివాసీ, గిరిజన సంఘాలు సైతం తమదైన రీతిలో ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జాబితాలో మార్పులు అసాధ్యం అన్న అభిప్రాయాలు బలపడ్డాయి.

తాజావార్తలు