ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం….
కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / 2022 – 23 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్స్ ప్రారంభమైనవని జడ్పీహెచ్ఎస్ కేసముద్రం(విలేజ్) అసిస్టెంట్ కోఆర్డినేటర్ బండారు నరేందర్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….చదువు మధ్యలో మానేసిన వారికి,మళ్లీ చదువు కొనసాగించాలని అనుకుంటున్నావారికి,గృహిణులకు,ఇతర వృత్తులు చేసే వారికి,ప్రజా ప్రతినిధులకు,వివిధ సంఘాల నాయకులకు,సామాజికంగా ఆర్థికంగా,వెనుకబడిన వర్గాల వారికి ఓపెన్ టెన్త్ అలాగే ఇంటర్లు ఒక సువర్ణ అవకాశమని తెలిపారు.ఓపెన్ టెన్త్ లో పదవ తరగతికి వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలని,ఓపెన్ ఇంటర్ కు పదవ తరగతి పూర్తి చేసి వయస్సు 15 సంవత్సరాలు నుండి ఉండాలని తెలిపారు.గతంలో ఇంటర్ ఫెయిల్ అయిన వారికి కూడా దీంట్లో అవకాశం కలదు అని పేర్కొన్నారు.ఈ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు కూడా కలదని,దీనిలో అడ్మిషన్ పొందిన వారికి ప్రతి ఆదివారం,సెలవు రోజులలో తరగతులు ఉంటాయన్నారు.ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ కూడా ఉంటుందన్నారు.ఎస్ఎస్సి కి అడ్మిషన్ ఫీజు రూ.1400 అలాగే రిజిస్ట్రేషన్ 150 రూపాయలు, ఇంటర్మీడియట్ కు అడ్మిషన్ ఫీజు రూ.1500,రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు ఉంటుందని వివరించారు.దీంట్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు రాయితీలు కూడా ఉంటుందని,ఓపెన్ టెన్త్,ఇంటర్లో ప్రవేశాల గడువు ఈనెల 14వ తేదీ లోపు కలదని తెలిపారు.