ఓపెన్ స్కూల్ ద్వార ఇంటర్ లో చేరడానికి ఈనెల 10చివరి అవకాశం.

చిట్యాల1( జనంసాక్షి) ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్లో చేరడానికి ఈనెల 10 తో గడువు ముగుస్తుందని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీరామ్ రఘుపతి, బుర్ర సదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాఠశాలకు, కాలేజీకి వెళ్ళడానికి అవకాశం లేనివారికి ఇంటివద్ద ఉండి టెన్త్, ఇంటర్ పూర్తి చేయడానికి ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశం. ఆసక్తి కలిగిన విద్యార్థిని,విద్యార్థులు, యువకులు ఈ అవకాశం వినియోగించుకొని ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేయవచ్చును. అలాగే ఒకటి నుండి ఏ తరగతి వరకు చదివి బడి మానివేసినవా రైన పదవ తరగతి చదవడానికి అవకాశం ఉంది.
ఇట్టి అవకాశం ఈ నెల 10 తో గడువు ముగుస్తుంది. వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబరు
9490005525 లలో సంప్రదించగలరని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీరామ్ రఘుపతి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ బుర్ర సదయ్య కోరారు

తాజావార్తలు