ఓబీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. – బీసీ నీనాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతనా -టి పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు
ఓబీసీల కుల గణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీసీల నినాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతను ప్రదర్శించడం ఏంటని అని టిపి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, ఆయన రామక్కపేటలో విలేకరులతో మాట్లాడారు,బీహార్,చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీలలో ఓబీసీ కులగణన తీర్మానం చేసి,పార్లమెంట్ కు పంపిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు ఓబీసీల కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా జాప్యం జరుగుతోందని అన్నారు.
కొందరు రాజకీయ ప్రముఖులు పదవి వ్యామోహంతో బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి,పదవులను అనుభవిస్తున్నారని అన్నారు,కేంద్ర ప్రభుత్వ బీసీ కమిషన్ తన విధులు నిర్వహించడంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందని, కేంద్రంలో ఉన్న 53 శాతం బీసీల కులగణన చేపడితే,రాజ్యాంగం లోని ఓబీసీలకు ఉండే సమానత్వపు హక్కును మోడీ కలరాస్తున్నాడని,విద్య,వైద్య, ఉపాధి,రాజకీయపరంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు,ఉద్యోగ రంగాలలో బీసీ ఆధిక్యతకంగా ఉన్నారనే,నివేదిక ప్రతిపాదనలు బయటపడి, తన హక్కుల్లో ఓబీసీలకు వాటా ఇవ్వవలసి వస్తోందనే భయంతో,అక్కసుతో ఓబీసీల కులగణనను కేంద్రం కావాలని చేపట్టలేక పోతుందని రామకృష్ణ ప్రభు అన్నారు,త్వరలో ఓబీసీలు మేల్కొని,వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఓటు ద్వారా చెబుతామని టిపి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంగెపు స్వామి శోభ,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల యాదగిరి, ఉపద్యాషుడు చింతల కుమార్,ప్రధాన కార్యదర్శి సాగర్ గౌడ్,మాజీ సర్పంచ్ మైసూరాజు,కొట్టే ఆంజనేయులు,మంతెన రాజు,బాలరాజు కమ్మరి తదితరులు పాల్గొన్నారు