ఓయు విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను విద్యార్థులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.