ఓయూలో అరాచకం సృష్టిస్తున్న పోలీసుల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసులు అరిచకం సృష్టిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం బయటకు తెలియకుండా ప్రత్యక్షప్రసారాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న వార్తా చానల్లకు చెందిన ఓఎఫ్‌సీ కేబుల్స్‌ను పోలీసులు కట్‌ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.