ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సంతోష్ భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. భౌతికకాయాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. ఓయూలో భారీగా బలగాలను మోహరించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు.