ఓయూలో చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి అత్మహత్య
ఉస్మానియా విశ్వవిద్యాలయం , హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రధాన గ్రంధాలయం వెనుక ప్రాంతంలో ఓ విద్యార్థి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఉదయం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలకోసం విచారణ ప్రారంభించారు.