ఓయూలో విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట సంతోష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓయూకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయూ నుంచి గన్ పార్క్ వరకు సంతోష్ అంతిమయాత్ర చేపడుతామని ఓయూ జేఏసీ ప్రకటించింది, సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.