ఓయూ పీఎస్‌పై విద్యార్థుల రాళ్ల వర్షం
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌పై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఇందిరా పార్క్ నుంచి చలో అసెంబ్లీకి తరలి వస్తున్న టీఆర్‌ఎస్ నేతలపై కూడా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో స్పృహ తప్పిపోయిన టీఆర్‌ఎస్ నేత శ్రవణ్‌ను చికిత్స నిమిత్తం ఈస్పత్రికి తరలించారు.