ఓయూ విద్యార్థి పరిస్థితి విషమం
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసుల బాష్పవాయువు ప్రయోగంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి కృష్ణానాయక్ పరిస్థితి విషమంగా ఉంది. మెదట గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. మరో 20 మంది విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.