ఓర్వలేకనే కాళేశ్వరంపై విమర్శలు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ క్రియాశీలక కార్యాచరణ కారణంగా తెలంగాణలో విద్యుత్‌, సాగునీరు, తాగునీటి రంగాల్లో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతీ ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ఆ దిశగా సాగుతుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో లక్షల బోరుబావులు, పల్లెలన్నీ అంధకారంలో మునిగినప్పుడు కేవలం మూడు నెలల్లోనే గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రం 10వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి దిశగా సాగిపోతున్నదన్నారు. హావిూలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న కాంగ్రెస్‌ వాళ్లు విమర్శలు మానాలన్నారు.