ఓలా క్యాబ్లో అసెంబ్లీకి ఎమ్మెల్యే
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి) : ఉప్పల్ బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ఓలా క్యాబ్లో వెళ్లారు. రామాంతపూర్లోని తన నివాసం నుంచి పాదయాత్రగా బయలుదేరి అనంతరం క్యాబ్లో అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ఆయన విూడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గత శాసనసభ సమావేశాల్లో క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పి ఆ విషయాన్ని ఇప్పటివరకూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే క్యాబ్లో అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటుదని అన్నారు. క్యాబ్ డ్రైవర్లకి రావాల్సిన కవిూషన్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని, అంతేకాక వారిపై పోలీసుల వేధింపులు కూడా పెరిగిపోయాయని అన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



