ఓ వివాహిత మహిళపై అత్యాచారం

కొండపాక: మెదక్‌ జిల్లా కొండపాక మండలం మాటుపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అర్ధరాత్రి సిద్ధిపేట నుంచి వస్తూ మాటుపల్లి స్టేజి వద్ద బస్సు దిగి తన ఇంటికి వెళ్తున్న ఓ వివాహిత (24)ను మిదినీపూర్‌ గ్రామానికి చెందిన లష్కర్‌ కొండస్వామి (30) తాను ఇంటి వద్ద దించి వస్తానని చెప్పి ద్విచక్రవాహనం పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో మాటుపల్లి శివారు వద్ద ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గ్రామానికి చేరుకుని స్థానికులకు విషయం తెలపడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సిద్ధిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసంకుక్క నూరుపల్లి ఎస్సై బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాలిస్తున్నారు.