ఔటర్‌పై కారు బోల్తా: ఒకరి మృతి

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వేగంగావెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.