ఔటర్‌పై వృద్ద దంపతుల అనుమానాస్పద మృతి
సంగారెడ్డి,జూలై5(జనం సాక్షి): వెలిమల ఔటర్ రింగ్ రోడ్డు పై వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా.. పఠాన్ చేరు ఔటర్ రింగ్ రోడ్డు పై వృద్ధ దంపతులు మృతి చెందడం సంచలనం కలిగించింది. రింగ్ రోడ్డు మధ్యలో వున్న చెట్ల పొదల్లో మృతదేహాలు ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. వీరు ఇద్దరు రింగురోడ్డు పైకి ఎలా వచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు మృత దేహాలను క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు. వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారా లేక ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేస్తుమని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రమే మరణించి ఉంటారని, వీరు ఎక్కడి వారు అని ఎలాంటి సమాచారం లేదనిఅన్నారు.