కంచలేని ట్రాన్స్ఫార్మర్లు పట్టించుకోని విద్యుత్ అధికారులు
(జనంసాక్షి) జూలై 15
అల్వాల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారాయి. సూర్య నగర్ కాలనీ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ దగ్గరలో ఉన్న కాలనీలలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ తో విద్యుత్ వోల్టేజ్ సరిపోకపోవడంతో రెండవ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నిమ్మకు నిరత్తినట్లుగా వ్యవహరిస్తూ విద్యుత్ సమస్య అంతగానే మిగిలిపోతుందని. సూర్య నగర్ కాలనీ అధ్యక్షులు కేబి నాగమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కంచ ఏర్పాటు చేయలేదు. పలు ప్రాంతాలలో తీగలు వేలాడుతూ గాలి వేచి ఉన్నప్పుడల్లా ట్రాన్స్ఫార్మర్ లో మంటలు రేగుతుండడంతో ప్రజలు బేబేలెత్తుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన సరే విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వోల్టేజ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.