కంటివెలుగును ఉపయోగించుకోవాలి

సిద్దిపేట,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణాలోని ప్రజలందరి కంటి సమస్యలను పరిష్కరించే నిమిత్తం 15వ తేదీ నుంచి నిర్వహించబోతున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. దీంతో గ్రామాల్లో కంటిచూపుతో బాధపడే వారికి పరిష్కారం దక్కగలదన్నారు. ఈ పథకానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌ ఆలోచన చాలాగొప్పదని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిఒక్కరిలో అంధత్వ నివారణ కోసం దాదాపు 120 రోజులు నిర్వహించబోతున్న వైద్య శిబిరాలకు ప్రజలు తరలివచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాలని సూచించారు.