కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట,ఆగస్ట్21(జనం సాక్షి): సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. మండలాల్లో కంటి వెలుగు పథకం విజయవంతంగా కొనసాగుతుంది. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కంటి సంబంధిత వ్యాధులున్నవారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. కంటి వెలుగు శిబిరాల వద్దకు రోజురోజుకు రద్దీ పెరగుతుం ది. సీఎం కేసీఆర్ చొరువతో తమకు కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కంటి వెలుగు పథకం మెడికల్ ఆఫీసర్ సూచించారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకుని, కంటి చూపు సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రావిూణ పేదలు కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వీరిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. చాలా మంది కంటి పోరలు, కనుగుడ్డుపై మాంసం పెరుగడం, మెల్లకన్ను సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వైద్యాధికారి వివరించారు. కంటి పరీక్షలు చేసి, అద్దాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్‌కు తరలిస్తున్నామని వివరించారు. 6 నెలలపాటు కంటి వెలుగు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం కంటి అద్దాలతోపాటు మందులను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో మూడు రోజుల్లో 458 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 95 మందికి కంటి అద్దాలు, 55 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. మిరుదొడ్డి మండలం ధర్మారంలో నిర్వహించిన శిబిరంలో 340 మందికి పరీక్షలు చేయగా..37 మందికి అద్దాలు, 88 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లిలో 304 మందికి పరీక్షలు చేయగా..34 మందికి అద్దాలు, 64 మం దికి శస్త్ర చికిత్సకు తరలించారు. రాయపోల్ మండలం రా మారంలో 406మందికి పరీక్ష చేయగా 78మందికి అద్దాలు, 59 మందికి శస్త్ర చికిత్సలు, తొగుట మండలంలో జప్తిలింగారెడ్డిపల్లిలో 208 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 26 మందికి అద్దాలు, 74 మందికి ఆఫరేషన్‌కు తరలించారు.