కంటి వెలుగుతో ప్రజలకు వెలుగు

నేడు పథకాన్ని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌
– రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట,ఆగస్టు14(జ‌నం సాక్షి): కంటివెలుగు పథకం కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్‌ బుదవరాం మల్కాపూర్‌లో ప్రారంభిస్తారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ పథకం పేదలకు వరం కానుందన్నారు. ఇంతకాలం కళ్లకు ఏమైనా పట్టించుకోని వారికి కంటి సమస్యలను గుర్తించి చికిత్సలు చేయించేందుకు సిఎం పథకం రూపొందించారని అన్నారు. సిద్దిపేటలో ఆయన విూడియాతో మాట్లాడుతూ  తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, ఇందులో భాగంగా రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులకు మేలు చేయడం జరుగుతుందన్నారు. దీనికితోడు తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు నిర్వహిటం జరుగుతుందన్నారు. దీనికితో ఇప్పటికే గర్భిణీలకు పౌష్టికాహారం, కేసీఆర్‌ కిట్లు ఇలా అన్ని విధాల ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని, అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. వారి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలంగాణలోని గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆర్థికంగా ఎందిగేందుకు కృషి చేస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. సిద్ధిపేటలోని కోమటి చెరువు దగ్గర గంగపుత్ర భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు కేసీఆర్‌ అధికారంలోకి రావడంతో చేపపిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించటం జరిగిందన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో చేపల పెంపకం చేపట్టి చేపల పెంపకానికి నిలయంగా రాష్ట్రాన్ని మార్చేలా కేసీఆర్‌ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని మంత్రి తెలిపారు. గత పాలకులు గంగపుత్రులను విస్మరించారని, ఇందుకోసం బడ్జెట్‌ కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపలు పట్టే బెస్తవారి సమస్యలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. గత మూడేళ్లుగా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రూ.11కోట్ల బడ్జెట్‌ను కేటాయించారన్నారు. ఈ ఏడాది 80కోట్ల చేపల పిల్లలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. వర్షాలు ఆలస్యం కావడంతో కొంత ఇబ్బంది అయ్యిందని, ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతంలో 11వేల చెరువులు నిండాయన్నారు. అన్ని చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రారంభిస్తామని హరీష్‌ రావు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధిపథంలో నడిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.