కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ విజయం
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపొందారు. టీఆర్ఎస్ ఇప్పటికే జగిత్యాలలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గెలిచిన రెండో స్థానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 12వేల ఓట్ల మెజార్టీతో సాయన్న ఘన విజయం సాధించారు. అలాగే చొప్పదండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకెరవి శంకర్ ఆధిక్యంలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి ఆయన 19,837 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.